News

కేంద్రం 1850 కోట్ల రూపాయల సాయం


కేంద్ర మంత్రి సుజన చౌదరి ఎపి రాజధాని అబివృద్ది కోసం ఇంతవరకు కేంద్రం 1850 కోట్ల రూపాయల సాయం చేసిందని  చెప్పారు. గతంలో ఏర్పాటైన మూడు రాష్ట్రాలకు కేంద్రం 1500 కోట్ల చొప్పునే ఇచ్చిందని ఆయన అన్నారు. ఎపికి అధికంగా నిదులు రావడానికి కారణం తామంతా చంద్రబాబు మార్గదర్శనంలో పనిచేయడం వల్లేనని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు 400 కోట్ల రూపాయల నిదులు విడుదల అయ్యాయని సుజనా చౌదరి తెలిపారు. విపక్షం ప్రతిదానిని రాజకీయం చేయడం తగదని ఆయన వ్యాఖ్యానించారు. అక్టోబర్ ఇరవై రెండు దసరా నాడు జరిగే రాజధాని శంకుస్థాపనకు ప్రధాని హాజరు అవుతారని మంత్రి తెలిపారు. యువత ముందుకు వస్తే పరిశ్రమల స్థాపనకు సహకరిస్తామని ఆయన తెలిపారు.